ఆస్పత్రిలో భర్త సజీవదహనం.. వార్త విని గుండెపోటుతో భార్య..

by Sumithra |
ఆస్పత్రిలో భర్త సజీవదహనం.. వార్త విని గుండెపోటుతో భార్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనాతో ఇప్పటికే లక్షల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందరో మృత్యువాతపడ్డారు. తాజాగా మహారాష్ట్రలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణవార్త విని గుండెపోటుతో భార్య మరణించింది. వివరాల ప్రకారం.. కుమార్​ జోషీ(45) అనే వ్యక్తి పాల్​గఢ్​జిల్లా వాసాయిలోని విజయ్‌ వల్లభ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రి రెండో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కుమార్​జోషీ మృతి చెందారు. ఈ వార్త విని విరార్‌లోని జీవ్‌ధార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోషీ భార్య చాందినీ జోషీ.. గుండెపోటుతో మరణించింది. ఆస్పత్రి ఐసీయూ ప్రమాదంలో చికిత్స పొందుతున్న 14 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story