- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన పల్లె ప్రగతి కార్యక్రమం
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సోమవారంతో ముగిసింది. గ్రామ పంచాయతీల్లో సమావేశాలు, పాదయాత్రలు, పారిశుద్ధ్యం, సురక్షిత మంచినీటి సరఫరా, దోమల నివారణ, ప్రభుత్వ, ఇతర ప్రాంతాల పరిశుభ్రత, చెత్త సేకరణ వంటి పలు అంశాల్లో పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్యాన్ని నిర్వహించారు. కరోనా సమయంలో నియంత్రిత పద్ధతిలో భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి 1,75,485 మంది ప్రజలు ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు. 12,752 గ్రామ పంచాయతీల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పాదయాత్రలు నిర్వహించి, సమస్యలు గుర్తించి, వాటిని నివారించారు. మురుగునీటి కాలువలను 81.26శాతం శుభ్రపరిచారు. సర్కారు తుమ్మ, పిచ్చి చెట్లను 76.54శాతం నివారించారు. 70.37 శాతం శానిటేషన్ చేశారు. కాగా, 79.31శాతం మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేశారు. మంచినీటి సరఫరా చానెల్స్ ని 78.84శాతం పరిశుభ్ర పరిచారు. జూన్ 5వ తేదీన ఒక్క రోజే 88.16శాతం డ్రై డే ని పాటించారు. 80.78శాతం గ్రామాల్లో ఫాగింగ్, అంగన్‌వాడీ కేంద్రాల్లో 81.21శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 81.78శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 82.90శాతం, హై స్కూల్స్ లో 80.62శాతం పారిశుద్ధ్యం నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు. అనివార్య కారణాల వల్ల పూర్తి కాని, మిగతా పనులను మరో మూడు రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.