Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. శ్రవణ్‌ రావుకు నోటీసులు జారీ

by Shiva |   ( Updated:2025-03-29 05:02:49.0  )
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. శ్రవణ్‌ రావుకు నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో A6గా ఉన్న ఓ మీడియా సంస్థ ఎండీ శ్రవణ్ రావు (Sravan Rao) ప్రస్తుతం అమెరికా (America)లో ఉన్నారు. ఈ మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులలో ఇవాళ పంజాగుట్ట పీఎస్‌కు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అదేవిధంగా నోటీసులకు సంబంధించి మరో కాపీని అధికారులు ఈనెల 26న హైదరాబాద్‌ (Hyderabad)లోని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే, గతేడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించ పంజాగుట్ట (Panjagutta) పోలీస్ స్టేషన్‌లో తనపై కేసు నమోదైన విషయం తెలియగానే శ్రవణ్ రావు ముందు లండన్‌ (London)కు వెళ్లారు.

సిట్ అధికారులకు (SIT Officials) దొరక్కుండా అక్కడి నుంచి నేరుగా అమెరికాకు చేరుకున్నారు. దీంతో ఆయనకు తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిట్ అధికారులు సీబీఐ (CBI), ఇంటర్‌పోల్ (Interpol) సహకారంతో అమెరికాలో ఉన్న శ్రవణ్ రావు (Sravan Rao)పై రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notices) జారీ చేయించారు. ఈ క్రమంలోనే కేసులో తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు (High Court) ఇచ్చి తీర్పును సవాలు చేస్తూ ఇటీవలే శ్రవణ్ రావు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా విచారణకు పూర్తిగా సహకారించాలంటూ నిందితుడు శ్రవణ్‌ రావుకు సూచించింది. ఈ మేరకు ఇవాళ ఆయన తెల్లవారుజామున 2 గంటలకు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన సిట్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు.

Next Story

Most Viewed