- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ఊళ్లో ఉంటే అంతా కీడే.. గ్రామస్థులు ఏం చేశారంటే
దిశ, వెబ్ డెస్క్ : అన్నింటిలో ప్రమాదకరం మూఢనమ్మకాలు. అయితే ఈ మూఢ నమ్మకాల వలన చాలా మంది అనేక సమస్యల్లో చిక్కుకుంటారు. కంప్యూటర్ యుగంలో మానవుడు విభిన్న రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో దూసుక పోతున్నా ఇప్పటికి చాలా మంది ఈ మూఢ నమ్మకాల ఊబిలో చిక్కుకుని ఉన్నారు. ఇవి ఎక్కువగా గ్రామాల్లో పాతుకపోయి ఉన్నాయి. చేతబడి అని లేక మాయలు, మంత్రాలు అంటూ అనేక మంది అమాయకులను దోచుకుంటారు. ఇంకొంతమంది ఆ ఊరిలో ఉంటే మంచి జరగడంలేదని, లేదా ఆ ఇంట్లో ఉంటే మంచి జరగడం లేదని ఊరు విడిచిపెట్టి పోవడమో లేక ఇళ్లు విడిచి పెట్టి పోవడమో చేస్తారు.
అయితే ఇలాంటి సంఘటననే ఒకటి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామంలో చోటు చేసుకుంది. మూఢ నమ్మకాల ఊబిలో చిక్కుకుని కొంత మంది గిరిజనులు ఉన్న ఊరుని వదలి మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పాటగూడలోని ఓ గిరిజన తెగకి చెందిన కుమ్ర, కోడప, ఆత్రం వంశానికి చెందిన కుటుంబాలు తమ ఊరిలో ఉంటే తమకు ఏం శుభకార్యాలు జరగడం లేదని, తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఉన్న గ్రామాన్ని వదిలి కొద్ది దూరంలో వ్యవసాయ చేనులో వేరే గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న సీ ఐ వారితో మాట్లడుతూ మూఢనమ్మకాలను వదిలి అందరూ కలసి మెలసి ఉండాలన్నారు. ఎవరితోను గొడవలు పెట్టుకోకూడదు అని హెచ్చరించారు. దీంతో గ్రామం వదిలి వెళ్లిన వారు తమకు ఎవరితో తగవులు లేవని తమకి పాటగూడలో ఉంటే కీడు జరుగుతుందనే వారు ఊరు వదిలి వేసాం అని పోలీసులకు తెలిపారు.