గిరిజ‌నుడి పూరిగుడిసె ద‌గ్ధం

by Shyam |
గిరిజ‌నుడి పూరిగుడిసె ద‌గ్ధం
X

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల‌మండ‌లం ఆర్ కొత్త‌గూడెంలో ప‌ల్లం వీర‌య్య అనే ఓ నిరుపేద గిరిజ‌నుడి పూరిగుడిసె ప్ర‌మాద‌వ‌శాత్తు ద‌గ్ధ‌మైంది. సోమ‌వారం కూలి ప‌నుల‌కు వెళ్లిన గిరిజనుడు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చేస‌రికి ఇల్లు పూర్తిగా ద‌హ‌న‌మై ఉంది. దీంతో వీర‌య్య కుటుంబ‌స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. ఇంట్లోని వ‌స్త‌వుల‌న్నీ ఆహుత‌య్యాయి. గిరిజ‌నుడి కుటుంబ స‌భ్యులు కేవ‌ల క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే పొదెం వీర‌య్య వెంట‌నే త‌హ‌సీల్దార్‌తో మాట్లాడారు. బాధిత గిర‌జ‌నుడికి ఆప‌ద్బాంధు ప‌థ‌కం కింద రూ.10వేలు అంద‌జేయాల‌ని ఆదేశించారు. అయితే ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగి ఉంటుంద‌నే విష‌య‌మై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

tag: Tribal, hut, Burned, bhadradri kothagudem

Advertisement

Next Story