హుండీలు పగులగొట్టి.. రామాలయంలో దొంగతనం

by Sridhar Babu |
theft, Ramalayam
X

దిశ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌ రామాలయం ఆయలంలో సోమవారం రాత్రి రాత్రి దొంగతనం జరిగింది. అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన దొంగలు నగదు మరియు 27 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, అమ్మవారి మెడలో పుస్తెల తాడును ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో మంగళవారం ఉదయం నిత్య పూజా కార్యక్రమాల కోసం ఆలయానికి వచ్చిన పూజారి ఒక్కసారిగా పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. ఆభరణాలు, హుండీలను పగలగొట్టింది గుర్తించి ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని వేలిముద్రలు సేకరించారు. అయితే ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు..

పట్టణంలోని ఆలయాల్లో తరుచూ దొంగతనాలు జరుగుతుండడంతో ఆయా ఆలయాలను దర్శించుకునే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ ఉన్నప్పటికీ రామాలయంలో దొంగలు చొరబడి నగలు, హుండీని పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని వార్డుల్లో పట్టణ పోలీసులచే రాత్రి పూట గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ రోజూ దొంగతనాలు జరుగడం భక్తులను కలవరపెడుతోంది. సీతమ్మ వారి నగలకే రక్షణ లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ధరూర్ క్యాంప్ రామాలయంలో కూడా చాలాసార్లు దొంగలు పడి అమ్మవారి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. రామాలయలను దొంగలు ఎక్కువ టార్గెట్ చేస్తుండంతో భక్తులలో ఆందోళనలు కలిగిస్తుంది. పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాల్సిన ఇన్విస్టుగేషన్ డిపార్ట్మెంట్ పోలీసుల నిఘా లోపం వల్ల ఇలాంటి సంఘటన లు తరచూ చోటు చేసుకుంటున్నాయని, ఆలయాల భక్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story