మూడు రాజధానుల అంశానికి చట్టబద్ధత లేదు

by srinivas |
మూడు రాజధానుల అంశానికి చట్టబద్ధత లేదు
X

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టానికి అసెంబ్లీలో సవరణ చేయడంపై ఫిర్యాదు చేశారు. ఆ సవరణ చెల్లదని లేఖలో స్పష్టం చేశారు. అలాగే మూడు రాజధానుల అంశంపై కూడా ఫిర్యాదు చేశారు. విభజన చట్టంలో లేని విధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. పార్లమెంటులో చట్టాన్ని సవరించినప్పుడే మూడు రాజధానులకు చట్టబద్ధత వస్తుందని లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని ఎలాగైతే పరిష్కరించారో..అలాగే మూడు రాజధానుల అంశాన్ని కూడా కేంద్రమే పరిష్కరించాలని కోరారు. మరోవైపు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని లేఖలో స్పష్టం చేశారు. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆర్థిక దుస్థితి ఏపీలో ఉందని రఘురామ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed