బొబ్బిలి, పార్వతీపురం మధ్య నిలిచిన రాకపోకలు

by srinivas |
బొబ్బిలి, పార్వతీపురం మధ్య నిలిచిన రాకపోకలు
X

విజయనగరం జిల్లాలోని ప్రధాన మండలాలైన బొబ్బిలి, పార్వతీపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా కష్టకాలంలో ప్రజలపై పగబట్టినట్టు గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని ఈ రెండు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా, పని వాళ్లు దొరకక, ఒకరిద్దరే వ్యవసాయ పనులు చేసుకుంటున్న వేళ.. కురుస్తున్న వర్షాలకు సీతానగరం మండలంలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక రహదారి నిర్మించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇది కొతకు గురై కొట్టుకుపోయింది. దీంతో 36వ రహదారిపై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Tags: rains, vijayanagaram district, bobbili, parvathipuram, transport stuck

Advertisement

Next Story