దారుణం : అత్తింటివారిపై దాడి చేసిన అల్లుడు.. కారణం అదేనా ?

by Mahesh |   ( Updated:2021-10-17 22:07:37.0  )
దారుణం :  అత్తింటివారిపై దాడి చేసిన అల్లుడు.. కారణం అదేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అత్తింటి వారిపై అల్లుడు దాడి చేసిన ఘటన జిల్లాలోని మైలవరం మండలం వెదురు బీడెంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు రాంబాబు అత్తింటి వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మామ కొండల రావు తీవ్రంగా గాయపడి మరణించగా, అత్త, భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే దాడి చేయడానికి కుటుంబకలహాలే కారణమంటున్నారు స్థానికులు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story