- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షీ టీం వద్ద 801 మంది.. షేమ్ షేమ్
దిశ, క్రైమ్ బ్యూరో : మహిళలపై రకరకాల వేధింపులకు గురి చేసిన వారిని 6 నెలల కాలంలో 801 మందిని అరెస్టు చేశామని ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ ద్వారా ఫిబ్రవరిలో పట్టుబడిన 224 (మేజర్లు-188, మైనర్లు-36) మంది ఆకతాయిలకు బుధవారం ఆన్‌లైన్ కౌన్సెల్సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా మాట్లాడుతూ గతేడాది (2020) అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ ఇచ్చిన ఆన్ లైన్ కౌన్సెల్సింగ్ సెషన్ లో ఇప్పటి వరకూ 700 మంది మేజర్లు, 101 మంది మైనర్లు పాల్గొన్నారని తెలిపారు. ఒక్కసారి పట్టుబడ్డ వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే, మునుపటి నేరంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకతాయిలను గుర్తించేందుకు షీ టీమ్ వద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉందన్నారు.
ఫిబ్రవరి -21లో వచ్చిన ఫిర్యాదులలో 74 శాతం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచే వచ్చాయన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు అత్యధిక కేసులను నమోదు చేశారని ప్రశంసించారు. సైబరాబాద్ నుంచి 78, హైదరాబాద్ నుంచి 36 , రాచకొండ నుంచి 17 మంది కౌన్సెలింగ్ లో పాల్గొన్నట్టు తెలిపారు. వాట్సాప్, ఈ-మెయిల్, ట్విట్టర్, హాక్ ఐ ద్వారా 75 శాతం ఫిర్యాదులు అందినట్టు వివరించారు. మహిళలను వేధించేవారిలో 72 శాతం 19-35 సంవత్సరాల వయస్సు వారే ఉంటున్నారని తెలిపారు. ఫోన్, సోషల్ మీడియా ద్వారా వేధించిన వారు 57 శాతం ఉన్నారన్నారు. కౌన్సెలింగ్ లో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, 17 జిల్లాలకు చెందిన ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లు, సైకలాజిస్టులు పాల్గొన్నారు.