తల్లిదండ్రులు మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలి

by Shyam |   ( Updated:2021-12-02 06:39:51.0  )
Abhyas IIT Foundation
X

దిశ, తొర్రూరు: తల్లిదండ్రులు పిల్లల చదువులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్‌బీఐ బ్యాంకు మహబూబాబాద్ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్ సూచించారు. గురువారం అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జక్కుల సతీష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటినుంచే జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యం పెట్టుకోవాలని, ఏదో ఒక రంగంలో ప్రతిభ కనభర్చాలని సూచించారు. చదువుతో పాటు ఆటలు, పాటల్లోనూ రాణించాలని అన్నారు. అప్పుడే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని అన్నారు. ప్రణాళిక ఏర్పరచుకొని కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని తెలిపారు.

అంతేగాకుండా.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌ అవసరాలకు ముఖ్యంగా మెరుగైన విద్య అందించేందుకు అనంతరం వివాహ ఖర్చులకు ముందుగానే ఆదా చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం విద్యకయ్యే ఖర్చు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి జీవితానికీ భరోసా లేదని కనుక ఇన్సూరెన్స్ అందరికీ తప్పనిసరన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సుమలత, ప్రిన్సిపల్ రవీందర్, ఎస్‌బీఐ లైఫ్ అడ్వైజర్ బొమ్మకంటి రమణ, స్కూల్ ఇన్‌చార్జి శివకుమార్, మౌనిక, యాకూబ్ పాషా, రమేష్, విజయ్, నరేష్ బాబు, శ్రీనివాస్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story