సీఏఏపై తీర్మానం రాజకీయ కోణమే..

by Shyam |
సీఏఏపై తీర్మానం రాజకీయ కోణమే..
X

దిశ, న్యూస్‌బ్యూరో : ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏపై తెలంగాణ ప్రభుత్వం చేసిన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం మజ్లిస్ పార్టీ మెప్పు కోసమే చేసినట్టు ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. గాంధీ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో 2010 ఎన్పీఆర్‌లో అమలు చేసిన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేలా, మోడీ ప్రభుత్వం సవరణలు చేసిన ఎన్పీఆర్‌ను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయబోమని కేంద్రానికి స్పష్టం చేయాలన్నారు.ఎప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న జనగణనలో ఎన్పీఆర్‌‌లోని 31 అంశాలను సేకరించేందుకు రెడీగా ఉన్న అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్పీఆర్‌లో వ్యక్తిగత సమాచారం సేకరించబోమని చెప్పడం ప్రజలను మోసం చేయడమే తెలిపారు. ఎన్పీఆర్‌లో సేకరించిన అంశాలనే ఎన్నాఆర్సీలోనూ పత్రాల రూపంలో చూపించాలని, లేనియెడల వారిని అనుమానితులుగా గుర్తించి పౌరసత్వం రద్దు చేస్తారనే విషయాన్ని గుర్తుచేశారు. గతంలో నల్లధనం వెలికితీస్తామని చెప్పి నోట్ల రద్దు చేశారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు తప్ప నల్లధనం మచ్చుకైనా కనిపించలేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ..అస్సాంలో నిర్వహించిన ఎన్నార్సీ వలన ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులకు పౌరసత్వం వచ్చిందని, నిజమైన అస్సామీలు పేదల, బడుగు, బలహీన వర్గాలకు రాలేదన్నారు. ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ లీడర్లు దేశ ద్రోహులు చిత్రికరిస్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్పీఆర్, ఎన్నార్సీల విషయంలో అప్రమతంగా ఉండాలన్నారు. బీజేపీ పార్టీ మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే ఇలాంటి చట్టాలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానం కేవలం వ్యతిరేకించడానికి తప్ప ఆపేందుకు కాదన్నారు. అస్సాంలో 40లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు భారత పౌర సత్వం కోల్పొయారన్నారు. బీజేపీ ప్రభుత్వ కుట్రలను టీఆర్ఎస్ ఎలా అడ్డుకుంటుందో చెప్పాలని బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు.

Tags: caa, nrc, npr, trs, congress,mim,bjp, addanki dayakar, bellaiah naik

Advertisement

Next Story