- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే..
దిశ,ఖమ్మం రూరల్ : భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల సీపీఎం శ్రేణులు మండలంలోని తెల్దారుపల్లి గ్రామానికి చేరుకున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తమ్మినేని సుబ్బయ్య చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం పూలమాలవేసి ర్యాలీ తెల్దారుపల్లి నుంచి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సాయుధ పోరాటాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందన్నారు. బిజెపి ఆటలు తెలంగాణలో సాగనివ్వమాన్నారు. నాలుగు వేల మంది అమరవీరుల త్యాగంతో తెలంగాణ భారతదేశంలో విలీనమైంది అన్నారు. ర్యాలీ కోదాడ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ క్రాస్ రోడ్ లోని సుబ్బయ్య భవన్ లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, మంచికంటి రాం కిషన్ రావు, గంగవరపు శ్రీనివాసరావు, గుర్రం సూరయ్య, వజ్జా వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ పెద్దతండ నాయుడు పేట మీదుగా ఖమ్మం నగరం లోకి ప్రవేశించింది.