- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్టీ గెలుపుకోసం.. ఒక్కటైన బాబాయ్, అబ్బాయ్
లక్నో: ఎన్నికలు వస్తే బద్ధ శత్రువులే కలుస్తారు. అలాంటిది బంధువులు కలిసిపోరా! తనను కాదని ములాయం సింగ్ కొడుక్కి పార్టీ అధికారం అప్పగించడంతో అలిగి శివ్‌పాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్‌వాది పార్టీ(పీఎస్పీఎల్) ని స్థాపించారు. తాజాగా శివ్‌పాల్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఒక్కటయ్యారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు.
ఈ నేపథ్యంలో తన బాబాయ్ శివ్‌పాల్‌తో పొత్తు కుదుర్చుకున్నట్లు అఖిలేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పీఎస్పీఎల్ జాతీయాధ్యక్షుడితో కూటమి విషయమై నిర్ణయం తీసుకున్నాం. ప్రాంతీయ పార్టీలతో కూడుకుని ఎస్పీ మరింత బలోపేతంగా మారుతుంది. ఇది ఎస్పీని విజయం దిశగా తీసుకెళ్తుంది’ అని ట్వీట్ చేశారు. కాగా శిశుపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం యాదవ్ సోదరుడు కావడం గమనార్హం. అయితే తనను కాదని అఖిలేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఎస్పీని వీడి సొంతంగా పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో అఖిలేష్ స్వయంగా వెళ్లి ఆహ్వానించే సరికి కూటమికి అంగీకారం తెలిపినట్లు రాజకీయ సన్నిహితులు చెబుతున్నారు.