అలా కిడ్నాపైన బాలుడిని ఎలా పట్టుకున్నారంటే !

by Shyam |   ( Updated:2020-05-14 08:17:12.0  )
అలా కిడ్నాపైన బాలుడిని ఎలా పట్టుకున్నారంటే !
X

దిశ, హైదరాబాద్: నగర పోలీసులు మరోసారి ఓ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని అంతా ఊపిరిపీల్చుకునేంత పనిచేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నా ఏ మాత్రం తగ్గకుండా టాస్క్‌ను పినిష్ చేశారు. మాకు మేమే పోటీ మాకు లేదు సాటి అంటూ శభాష్ అనిపించుకున్నారు. బాధలో ఉన్నవారికి భరోసా ఇస్తూనే ఏమాత్రం టెన్షన్ పెట్టకుండా కేవలం 24 అవర్స్‌లోనే కన్నీటిని తూడ్చి ఆనందాన్ని వెయ్యిరెట్లు చేశారు. దీంతో ఆ పోలీసులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకూ విషయం ఏంటంటే… బుధవారం తెల్లవారుజామున చాదర్‌ఘాట్ పోలీస్‌ష్టేషన్ సమీపంలోని ఓ ఫర్నిచర్ షాపు ముందు యాచకురాలు రోహిణి తన ఏడాది కుమారుడితో నిద్రిస్తోంది. అంతకు ముందే తల్లి వద్ద పాలు తాగి కునుకులోకి బాలుడు జారుకున్నాడు. ఇంతలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తల్లికి ఏమాత్రం డౌట్ రాకుండా బాలుడు సాధును ఎత్తుకెళ్లిపోయాడు. ఇంతలోనే నిద్రలోంచి బయటకు వచ్చిన తల్లికి పక్కన కొడుకు కనిపించకపోయేసరికి నోటి నుంచి మాటరానంత పనైంది. అటు ఇటూ వెతికినా బాలుడి జాడ లేకపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి చాదర్‌ఘాట్ పోలీసులకు విషయాన్ని వివరించింది.

వెంటనే రంగంలోకి దిగిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాలుడీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీని సేకరించి అనుమానిత వ్యక్తులను విచారిస్తూ, ఇతర ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో అలసిపోయి ఉన్నప్పటికీ తల్లి బాధను, అటు బాలుడిని పరిస్థితిని గుర్తుకు తెచ్చుకుంటూ తీవ్రంగా శ్రమించారు. ఇదే క్రమంలో తల్లి బెంగ పడుతుండగా దైర్యం నూరిపోసి గుండెను నిబ్బరపరిచారు. సీసీ ఫుటేజ్‌ను కీలకంగా చేసుకొని ముమ్మర ప్రయత్నాలు చేశారు. చివరకు తలాబ్‌కట్ట వద్ద కిడ్నాపర్‌ను పట్టుకొని.. బాలుడిని తీసుకువచ్చి తల్లి ఒడికి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే క్రమంలో బాలుడు తల్లిని చూడగానే, తల్లి కొడుకును చూడగానే పడిన సంతోషం అక్కడున్న వారందరికీ హాట్‌ టచ్చింగ్‌గా అనిపించింది. దీంతో కుమారుడు తన ఒడికి చేరడంతో తల్లి సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. అటు కిడ్నాపర్ మాత్రం తమకు పిల్లలు లేకపోవడంతోనే బాలుడిని దొంగతనంగా తెచ్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed