- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరద ప్రవాహంలో వ్యక్తి గల్లంతు

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కలిపాక-తిప్పాపురం మధ్య వాగు ఉప్పొంగడంతో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. తిప్పాపురం గ్రామానికి చెందిన మీడెం చిన్న బతకయ్య(41) కలిపాక సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. వాగు ప్రవాహం అధికంగా ఉండటంతో తాడు సాయంతో పలువురు దాటారు. అతడు కూడా వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులు గాలింపు చేపట్టారు.
Next Story