- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి కంటే ఎక్కువగా సీఎం జగన్ పాలన: మంత్రి అనిల్ కుమార్
దిశ, ఏపీ బ్యూరో: ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలు సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం జగన్ వెంట సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
అనంతరం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువగా జగన్ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు సిద్ధాంతాలు పక్కనపెట్టి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌లు చేసి ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదో అరుదైన ఘట్టం అని పేర్కొన్నారు. ఓటీఎస్ పథకాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి అనిల్ విమర్శించారు.