మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

by vinod kumar |
మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం
X

దిశ, మహబూబ్ నగర్: గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న పాలమూరు జిల్లాకు మరోసారి కరోనా భయం పట్టుకుంది. తాజాగా శనివారం 55 రోజుల బాలుడు మృత్యువాత పడగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం ప్రజలను కలవర పెడుతోన్నది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పునుంతల మండల కేంద్రంలో 55 రోజులు బాలుడికి కరోనా నిర్ధారణ కావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఉప్పునుంతల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూరు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే గ్రామస్తులు మాత్రం ముగ్గురికి కరోనా సోకిందని చెబుతుండగా దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. మొత్తం మీద మరోసారి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది.

Advertisement

Next Story