- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభ్యర్థులు చేజారకుండా హోటళ్లకు..
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఫలితాలు ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఫలితాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను తమ ఆధీనంలో ఉండాలని సూచించాయి. మధ్యాహ్నం వరకు ఫలితాలపై క్లారిటీ లేకపోవడం, టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా నిలుస్తుండటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల నుంచి తమ దగ్గరకు రావాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ బాధ్యతలను కొంతమంది మంత్రులకు అప్పగించారు. దీంతో డివిజన్ల వారీగా బయటకు వస్తున్న ఫలితాలను చూసి వారిని తమ ఆధీనంలో పెట్టుకుంటున్నారు.
గెలిచిన వారు వెంటనే రిటర్నింగ్ అధికారుల దగ్గర నుంచి ధృవీకరణ పత్రాలను తీసుకుని రావాలని, లేని పక్షంలో అక్కడ వారి తరుపున ఎవరినైనా అందుబాటులో పెట్టి పార్టీ కార్యాలయాలు, సూచించిన హోటళ్ల దగ్గరకు రావాలంటూ ఆదేశించారు. కొంతమంది గెలుపు ఖాయమవుతున్న నేపథ్యంలో వారిని తమ దగ్గరే అంటిపెట్టుకుంటున్నారు. మేయర్ పీఠం మేజిక్ ఫిగర్ కోసం ఈసారి పార్టీలు కష్టపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ సెంచరీ అంటూ ప్రచారం చేసుకున్నా… అంచనాలు తారుమారవుతున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన కార్పొరేటర్లలను తమ ఆధీనంలో పెట్టుకుంటున్నాయి.