తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి ఆపన్న హస్తం

by Shyam |
childern
X

దిశ, అర్వపల్లి: చిన్నవయసులోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఐదేండ్ల బాలిక చింత అగ్నికకు ఎంఎస్ఎస్ నాయకులు అండగా నిలిచారు.వివరాల్లోకి వెళితే జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చింత అగ్నిక బుడిబుడి అడుగులు వేసే సమయంలో తన కన్నతల్లి ఉమ అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది.తండ్రి మధుసూదన్ గ్రామంలో కూలి పని చేస్తూ తన కూతురు అగ్నికను అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు.ఈ క్రమంలో గత 4 రోజుల క్రితం తండ్రి మధుసూదన్ కూడా అనారోగ్యంతో మరణించాడు.మధుసూదన్ తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో కుటుంబ పోషణ భారమైది.దీంతో అగ్నిక అనాథగా మారింది.

విషయం తెలుసుకున్న మాదిగ సంక్షేమ సంఘం(ఎంఎస్ఎస్)నాయకులు వెంటనే స్పందించి సోమవారం గ్రామంలో అగ్నికకు తక్షణ సహాయం కింద క్వింటా బియ్యాన్ని అందజేశారు.అనంతరం ఆసంఘం నాయకులు మాట్లాడుతూ అగ్నిక కు ఎంఎస్ఎస్ అండగా ఉంటుందని,ఆమె చదువుల బాధ్యతను కూడా సంఘం భరిస్తుందని,తన తండ్రి దశదిన ఖర్మకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.అగ్నిక ను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని మంచి మనసుతో కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎస్ అధ్యక్షుడు జీడి నాగరాజు,నాయకులు చెర్కుపల్లి లక్ష్మణ్,చింత భిక్షం,బొడ్డు శ్రీనివాస్,మిర్యాల సుదర్శన్,జీడి సైదులు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed