మీడియా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి : అల్లం

by Shyam |
Media Academy
X

దిశ, తెలంగాణ బ్యూరో : మీడియా అకాడమీ భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇంజినీర్లను కోరారు. నాంపల్లిలోని మీడియా అకాడమీ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియో కాన్ఫరెన్స్ తో పాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియం నిర్మిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమీక్షలో రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఇంజనీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజనీర్ నితీన్, మీడియా అకాడమీ మేనేజర్ వనజ, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచందర్ రావు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed