- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడుగు పడిందని ఆవుపేడను శరీరానికి రాసిన పెద్దలు.. అంతలోనే
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. నూతన ఆధునీకరణతో వేగంగా దూసుకుపోతోంది. అయితే ఈ కంప్యూటర్ యుగంలో కూడా మూఢనమ్మకాలు ప్రజలను వదలడం లేదు. ఇప్పటికీ చాలా మంది మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్‌లోని సర్‌గజ్ జిల్లాలో ముత్కి గ్రామానికి చెందిన వ్యక్తిని మూఢనమ్మకాలు బలి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. భారీ గా వర్షం కురవడంతో కిషన్ రామ్ వాడా(35) అనే వ్యక్తి ఇంటి ముందు నీళ్లు నిలిచాయి. అయితే వాటిని తీయడానికి అతను బయటికి వెళ్లగా ఆ సమయంలో అతను పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించకుండా ఆవుపేడతో చికిత్స చేశారు. ఆవుపేడను అతని శరీరానికి రాశారు. ఒక తలను వదిలేసి తన శరీరాన్ని మొత్తం ఆవుపేడలో ఉంచారు. అలా అరగంట సేపు తనను పేడలో ఉంచినా ఎలాంటి మార్పు కనిపించలే. అప్పటికి తన ఆరోగ్యపరిస్థితి క్షీణించి, ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయాడు.