- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఆత్మహత్యాయత్నం
దిశ, కామారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గ్రామానికి చెందిన కృష్ణాజివాడి గ్రామంలో రవీందర్ రెడ్డి అనే వ్యక్తం నివాసం ఉంటున్నాడు. గత మూడు నెలలుగా భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనోవేధనకు గురై, ఇంటి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. గమనించిన గ్రామస్థులు అతడిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే రవీందర్ రెడ్డి దాదాపు 80 శాతం కాలిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రవీందర్ రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.