- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థియేటర్స్‌లోనే తేల్చుకోనున్న ‘ఖిలాడి’
దిశ, సినిమా : గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘క్రాక్’ మూవీతో మాసివ్ హిట్ కొట్టిన మాస్ మహరాజ్.. అదే ఊపులో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ‘ఖిలాడి’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తుండగా, ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పష్టతనిచ్చారు. రవితేజ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు. యాక్షన్, రొమాన్స్, కథ, కథనం వంటి అంశాలన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయని, ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.