మే 15 వరకు.. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్

by vinod kumar |
మే 15 వరకు.. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్
X

భోపాల్: కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నెల 15వ తేదీ వరకు అమలు చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కరోనా శృంఖలాలను తెంచడానికి 15వ తేదీ వరకు కచ్చితంగా లాక్‌డౌన్ వేయాల్సిందేనని, కఠినమైన జనతా కర్ఫ్యూను అమలు చేయాల్సిందేనని వివరించారు. అన్నింటిని చాలా కాలం మూసి ఉంచకపోవచ్చునని, కానీ, 18శాతం పాజిటివిటీతో అన్ని సేవలు, వాణిజ్య సముదాయాలను ఓపెన్‌గానే ఉంచడమూ సబబు కాదని తెలిపారు. రాష్ట్రంలో గురువారం కొత్తగా 12421 కేసులు, 86 మరణాలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed