జనాల బతుకులను తాకట్టు పెడుతున్నారు : అచ్చెన్నాయుడు

by srinivas |
జనాల బతుకులను తాకట్టు పెడుతున్నారు : అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ చేసే అప్పులు ప్రజలకు గుదిబండే అని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. అప్పుల కోసం జనాల బతుకులను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రేషన్ ధరలు, మున్సిపల్ పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెడతామంటేనే రుణాలకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. రూ.2,525 కోట్ల అదనపు రుణం కోసం ప్రజలకు ఉరితాళ్లు బిగిస్తారా? అని ప్రశ్నించారు. కాగ్ నివేదిక ప్రకారం 6 నెలల్లో చేయాల్సిన దాని కన్నా 14 శాతం అధికంగా అప్పు చేశారని తెలిపారు. కేంద్రం ఇచ్చే డబ్బులు, అప్పు, పన్నులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.

Advertisement

Next Story