- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కొండా దంపతులు
దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణికం ఠాగూర్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు. కొత్త టీపీసీసీ ఎంపిక నేపథ్యంలో భాగంగా అభిప్రాయ సేకరణ చేస్తున్న సందర్భంగా కొండా దంపతులు గాంధీభవన్‌కు వచ్చి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. త్వరలో రానున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించారు. వరంగల్‌లో కాంగ్రెస్ గెలిచేందుకు చాలా అవకాశాలున్నాయని, సరైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని, పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ వివరించారు. ఈ సందర్భంగా వచ్చే గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై ఫోకస్ చేయాలని, జిల్లాలో నేతలను కో-ఆర్డినేట్ చేసుకోవాలని కొండా దంపతులకు ఠాగూర్ సూచించారు. తాము బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుందని, కాంగ్రెస్‌ను వీడమంటూ ఠాగూర్‌కు వివరించారు. దీంతో వారు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారానికి తెరపడినట్లైంది.