వోగ్ మ్యాగజైన్ కవర్‌పై హిల్లరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ

by Shyam |
వోగ్ మ్యాగజైన్ కవర్‌పై హిల్లరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ
X

దిశ, ఫీచర్స్ : అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ 73 ఏళ్ళ వయసులోనూ తన క్లాసిక్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్నారు. 1947 చికాగోలో జన్మించిన హిల్లరీ రోధమ్.. 1973లో యేల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకొని న్యాయవాద వృత్తి చేపట్టింది. 2000లో అమెరికన్ సెనేట్‌కు ఎన్నికై, తొలి ప్రథమ మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాదు న్యూయార్క్ నుంచి సెనేటర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా హిల్లరీనే. 1975లో బిల్ క్లింటన్‌‌ను వివాహం చేసుకున్న హిల్లరీ 1993 నుంచి 2001 వరకు అమెరికా ఫస్ట్ లేడీగా కొనసాగింది. అయితే ఆమె ఫస్ట్ లేడిగా ఉన్న సమయంలోనే ప్రతిష్టాత్మక వోగ్ మ్యాగ‌జైన్(1998) తన కవర్ ఫొటోను ప్రచురించింది. అయితే హిల్లరీ ఆ చిత్రం వెనక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

స్టైల్ ఐకాన్‌కు చిరునామాగా నిలిచే హిల్లరీ, కవర్ ఫోటోలో ఎప్పటిలాగే అద్భుతంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి కారణం ప్రముఖ డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కారణమని హిల్లరీ చెప్పింది. డిసెంబర్ 1998 ముఖచిత్రంపై హిల్లరీ ఫొటోను పబ్లిష్ చేయాల్సిందిగా, ఆస్కార్ డి లా, వోగ్ ఎడిటర్ ఇన్ చీఫ్ అన్నా వింటౌర్‌ను ఒప్పించడంతో ఇది సాధ్యమైంది. అంతేకాదు ఈ కవర్ కోసం పోజులిచ్చిన మొదటి ప్రథమ మహిళగా హిల్లరీ నిలిచింది.

‘వాస్తవానికి హిల్లరీ ఎవరో అనే విషయం పాఠకులకు తెలియాలనే పట్టుదలతో నేను వింటౌర్‌ను ఒప్పించగలిగాను. వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడే ఫొటో షూటింగ్ జరిగింది. ఇది సరైన పనా? కాదా? అనే సందిగ్ధంలో క్లింటన్ సలహాదారులుండగా.. ఆమె నన్ను ప్రోత్సహించింది. మీరు నాపై గొప్ప అభిమానంతో ఈ పని చేస్తున్నారు. మనం తప్పకుండా చేద్దాం అంటూ నా నిర్ణయానికి మద్ధతు తెలిపింది’ అని ఆస్కార్ డి లా రెండా తెలిపాడు. కవర్ కోసం ఆమె ధరించిన దుస్తులను ఆస్కార్ స్పెషల్ డిజైన్ చేయడం విశేషం.

Advertisement

Next Story