- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు
దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా, మరోవైపు వర్షాలు ప్రజలను ఊపిరి మెసలనివ్వడం లేదు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు బయట కాలు పెట్టే పరిస్థితిలేకుండా పోయింది. అంతేగాకుండా అంతేగాకుండా తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సా, దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది.
దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని, దీంతో రాగల 3,4 రోజుల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 23న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేసింది. వీటి ప్రభావంతో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాగులు, కాల్వలు, చెరువులు నిండి రోడ్లపై వరదలు పారుతున్న విషయం తెలిసిందే.