- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. భార్య, మామ గొంతు కోసి దారుణ హత్య
దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని శ్రీనివాస నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త, ఆయన సోదరుడు కలిసి భార్య, మామను గొంతు కోసి హత్య చేశారు. వివరాల ప్రకారం.. వెల్ది గ్రామానికి చెందిన బాలసాని ఓదెలు బిడ్డ లావణ్యను అన్నారం గ్రామానికి చెందిన గుడాల రమేష్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. అయితే, గత రెండు సంవత్సరాల క్రితం నుంచి భార్యపై అనుమానం పెట్టుకున్న రమేష్.. పలుమార్లు ఆమెతో గొడవపడ్డారు.
ఈ క్రమంలో పంచాయతీ పెద్దలు వారిని కలిసుండాలని చెప్పారు. తరచూ గొడవలు కావడంతో పోలీసులు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం కరీంనగర్ మహిళ పోలీస్టేషన్‌లో కౌన్సిలింగ్ పూర్తి చేసుకుని లావణ్య, ఆమె తండ్రి ఆటోలో వస్తుండగా.. శ్రీనివాస నగర్ సమీపంలో ఆటోకు అడ్డంగా బైక్‌ను పెట్టి రమేష్.. భార్య లావణ్య, మామను గొంతు కోశాడు.
ఈ క్రమంలో మృతురాలి కూతురు అడ్డుగా వెళ్లగా ఆమెకు చిన్న గాయమైంది. అయితే, మృతురాలి భర్త గుడాల రమేష్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అతని తమ్ముడు గుడాల అనిల్ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. హత్య అనంతరం ఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథిలు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మానకొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- manakondur
- murder