- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భార్యను పది చోట్ల పొడిచిన భర్త..

X
దిశ, వెబ్‌డెస్క్ : ములుగు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. విచక్షణ రహితంగా పొడవడంతో ఆమె త్రీవంగా గాయపడింది. వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాకా సంధ్యను ఆమె భర్త కొద్ది రోజులుగా అనుమానిస్తూ.. ఘర్షణ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సంధ్యపై భర్త కత్తితో దాడికి దిగాడు. సంధ్యను పది చోట్ల పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Next Story