అఖండ సినిమాలోని ఆ ఎద్దుల చరిత్ర ఏంటంటే?

by Shyam |   ( Updated:2021-12-04 03:53:19.0  )
అఖండ సినిమాలోని ఆ ఎద్దుల చరిత్ర ఏంటంటే?
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. అఖండ మూవీలో కనిపించిన రెండు ఎడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూవీ ఇంట్రడక్షన్‌లో దర్శకుడు యాక్షన్ చెప్పిన తర్వాత బసవ అనే ఎద్దు దర్శనమిస్తుంది. బాలకృష్ణ స్క్రీన్‌పై కనిపించే సమయంలో కూడా రెండు ఎద్దులు కనువిందు చేస్తాయి.

ఆ తర్వాత క్లైమాక్స్‌లో పోరాట సన్నివేశంలోనూ.. హీరో బాలకృష్ణ ను కాపాడేందుకు ఈ ఎద్దులు రంగంలోకి దిగుతాయి. ప్రస్తుతం అఖండ సినిమా విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి సినిమా విజయవంతానికి దోహదపడిన అంశాలపై చర్చించుకుంటున్నారు. అలా ఎద్దులు గురించి ప్రస్తావన వస్తుంది. ఈ ఎద్దులు అందరి దృష్టిని ఆకర్షించడంతో ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. అయితే అఖండ చిత్రంలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఎద్దుల జత కోసం దర్శకుడు బోయపాటి శ్రీను చాలా కష్టపడ్డారట. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల తిరిగారట.

అయితే ఆయన ఆలోచనలకు తగ్గట్టు ఎద్దుల జత ఎక్కడా లభించలేదు. చివరకు బోయపాటి సొంత జిల్లా అయిన గుంటూరులోని పెదకాకాని మండలం కొప్పురావూరిలో ఒక రైతు వద్ద ఉన్న ఎద్దుల జత బోయపాటిని ఆకర్షించింది. దీంతో ఆ ఎద్దులను అఖండ సినిమాలో పెట్టాడు. బోయపాటి అంచనాలకు తగిన విధంగా సినిమాలో ఆ ఎద్దులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

షాకింగ్: థియేటర్లో అఖండ మూవీ చూసిన అఘోరాలు..సినిమా చూస్తూ హాల్లో హల్ చల్.. ఎంజాయ్ చేసిన ఆడియన్స్….చివరికి అలా చేస్తూ బయటకి వెళ్లిపోయిన అఘోరాలు.. ఎక్కడంటే..?

Advertisement

Next Story