మధ్యాహ్నం వరకు మొత్తం నివేదిక కావాలి.. ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

by Anukaran |   ( Updated:2021-04-19 03:01:39.0  )
మధ్యాహ్నం వరకు మొత్తం నివేదిక కావాలి.. ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కరోనాను నియంత్రించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. థియేటర్లు, వైన్సులు, బార్లు, పబ్బుల్లో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కనీస వివరాలు లేకపోవడంతో న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. జిల్లా అధికారులు ఇచ్చే కరోనా కేసుల రిపోర్టులకు, ప్రభుత్వం ఇచ్చే పూర్తి రిపోర్టులకు చాలా వ్యత్యాసం ఉందంటూ కేసీఆర్ సర్కార్‌పై కోర్టు ఆగ్రహించింది. దీనికి స్పందించిన ఏజీ రాష్ట్రంలో త్వరలో జన సంచారం నియంత్రణకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం(ఇవాళ) మధ్యాహ్నం వరకు అసలు ఏమేం చర్యలు తీసుకుంటారో..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మొత్తం నివేదించాలని హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed