- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థర్డ్ వేవ్‌కు ఆజ్యం పోసినట్టే.. ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు హెచ్చరిక
న్యూఢిల్లీ: కొవిడ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘనలు థర్డ్ వేవ్‌కు మరింత ఆజ్యం పోస్తాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. లాక్‌డౌన్ ఆంక్షలు ఈ వారంలో ఎత్తేయడంతో షాపింగ్, మార్కెట్లు, మెట్రో స్టేషన్‌లలో పెద్ద ఎత్తున ప్రజలు చేరడం, ముందు జాగ్రత్తలపట్ల వారిలోని ఉదాసీనత వివరించే ఫొటోలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉల్లంఘనలు అందరినీ విపత్తులో ముంచేస్తాయని వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, షాప్‌కీపర్లను నిబంధనల అమలవ్వడానికి తోడ్పడేలా సెన్సిటైజ్ చేయాలని అధికారులను సూచించింది. ‘సెకండ్ వేవ్‌లోనే మనం చాలా కోల్పోయాం. ఆప్తులను కోల్పోయిన బాధ ఇప్పటికీ ఇంకా పోనేలేదు. నెల తిరగకముందే ఈ నిర్లక్ష్యం తగదు. ఇది థర్డ్ వేవ్‌కు మరింత ఆజ్యం పోసినట్టే అవుతుంది’ అని పేర్కొంది. అన్‌లాకింగ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరాలు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.