- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూనియన్ నాయకత్వాన్ని పిలిచి మాట్లాడండి…
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజాంబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సివిల్ సప్లై కార్పొరేషన్‌లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. సివిల్ హమాలీల గత వేతన ఒప్పందం 31 డిసెంబర్ 2019తో ముగిసిందనీ, 1 జనవరి 2020 నుంచి నూతన వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉండగా, ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
దీంతో ఈనెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ దిగివచ్చి, యూనియన్ నాయకత్వాన్ని పిలిచి మాట్లాడి, హమాలీల బస్తా రేటు క్వింటాల్‌కు రూ.24 పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.