- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉబికి వచ్చిన పాతాళగంగ.. పైపైకి భూగర్భ జలాలు
దిశ, ఆదిలాబాద్: జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు భూగర్భజలాలు ఉబికి వచ్చాయి. జిల్లాలో భూగర్భ జలాల మట్టం ప్రస్తుతం 3.03 మీటర్లలోనే లభ్యమవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 3.70 మీటర్లకు పైనే భూగర్భ జలాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచే జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం కంటే 50 శాతం అధికంగా వర్షం కురిసింది. దీంతో భూగర్భ జలాల నీటిమట్టం గణనీయంగా పెరిగింది.
పైపైకి భూగర్భ జలాలు..
జూన్‌లో భూగర్భ జలాల నీటి మట్టం 7.15 మీటర్లు ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు ఆగస్టు నెలలో 3.03 మీటర్ల నీటి మట్టం పెరిగింది. ఒక్కో నెలలో జలాలు పై పైకి వచ్చాయి. జిల్లాలో 18 మండలాలు ఉండగా.. కొన్ని మండలాల్లో సాధారణం..మరి కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో అన్ని మండలాల్లోనూ పాతాళగంగ పైకి వచ్చింది. నేరడిగొండ, నార్నూర్, గుడిహత్నూర్ మండలాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లా లోని జైనథ్ మండలం సాధనాల, తాంసీ మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులు నిండు కుండలా తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 392 చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగు దూకి పారుతున్నాయి. అన్ని మండలాల్లోనూ సరాసరి నీటి మట్టాలు పై పైకి వచ్చాయి. బావుల్లో చేతికి అందే లోతులో నీళ్లు చేరడం గమనార్హం.
మండలాల వారీగా భూగర్భ నీటి మట్టాలు
మండలం నీటి మట్టం
ఆదిలాబాద్ 2.30
బజార్హత్నూర్ 0.08
బేల 7.05
బోత్ 3.50
గుడిహత్నూర్ 2.65
జైనథ్ 4.15
నేరడిగొండ 1.15
తలమడుగు 0.25
భీంపూర్ 3.20
తాంసి 3.18
నార్నూర్ 6.40
ఉట్నూర్ 1.15