- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'నాకు బీమార్ రావొద్దంటే.. నేనేం చేయాలి? ప్రభుత్వం సరికొత్త స్లోగన్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యాధుల నియంత్రణ కొరకు సర్కార్ సరికొత్త స్లోగన్‌తో ముందుకు వెళ్లనున్నది. ప్రతీ వ్యక్తికి వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ‘నాకు బీమార్ రావొద్దంటే..నేనేం చేయాలి’ అనే నినాదంతో ప్రచారాలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం టీకా పంపిణీ పూర్తవగానే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సర్కార్ భావిస్తున్నది. వ్యాధులు, మందస్తు జాగ్రత్తలు, చేయాల్సిన కార్యక్రమాలు, తదితరవి దీనిలో భాగస్వామ్యం చేయనున్నారు. కరపత్రాలు, మైక్ సెట్లు రూపంలో ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయే వరకు ఈ ప్రచారాలను విస్తృతంగా కొనసాగిస్తారు.
మాస్కులు, భౌతికదూరం, శానిటేషన్ వంటివాటిపై నిత్యం అవగాహన కల్పిస్తారు. దీంతో పాత వ్యాధుల వ్యాప్తి అదుపులోకి రావడమే కాకుండా కొత్త వ్యాధులకు చెక్ పెట్చొచ్చని అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి కంట్రోల్ చేసేందుకు ఈ విధానం అద్భుతంగా పనిచేస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు, భౌతికదూరం, శానిటేషన్లు పాటిస్తే కరోనా వ్యాప్తిని సులువుగా తగ్గించవచ్చని వైద్యాధికారులు మరోసారి నొక్కి చెప్పారు.
- Tags
- corona