- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరవళ్లు తొక్కుతున్న గోదావరి.. ప్రవాహంలో చిక్కుకున్న MRO
దిశ, కాటారం : నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 121.5 మీటర్లకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరం పరిధిలోని అన్నారం(సరస్వతీ) బ్యారేజీ ఎగువనున్న SRSP, కడెం, ఎల్లంపల్లి, సుందిళ్ల జలాశయాల గేట్లు ఎత్తడంతో అన్నారం బ్యారేజీలో భారీగా నీటి మట్టం పెరిగింది.
ఈ క్రమంలో అన్నారం బ్యారేజీలోని 66 గేట్లకు గాను 56 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. ఇన్ ఫ్లో 8,02,300 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 56 గేట్లు ఎత్తి 9,02, 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ నీటి సామర్థ్యం10.87 టీఎంసీలు కాగా ప్రసుత నీటి మట్టంతో 4.29 టీఎంసీలకు చేరింది. వరద మొత్తం కాళేశ్వరం మీదుగా మేడిగడ్డ బ్యారేజీలోకి తరలిపోతోంది. మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలో 85 గేట్లకు గాను 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు తరలిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా ఇన్ ఫ్లో 9,65,030 క్యూసెక్కుల నీరు తరలి వస్తుండగా 70 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. బ్యారేజీ సామర్ధ్యం16.17 టీఎంసీలకు గాను 8 టీఎంసీలకు చేరుకుంది.
చండ్రుపల్లి వాగు, బండల వాగులను కమ్మేసిన బ్యారేజీ నీటి వరద..
అన్నారంలోని సరస్వతీ బ్యారేజ్‌కు భారీగా నీటి సామర్థ్యం పెరిగి వరద నీరు పోటెత్తడంతో 65 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో చండ్రుపల్లివాగు, మద్దులపల్లి బండల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, రోడ్డుపై వరద నీరు చేరి అన్నారం నుంచి మద్దులపల్లి, చండ్రుపల్లి, నాగేపల్లి, పలుగుల, కుంట్లం వెళ్లకుండా రాకపోకలు స్తంభించాయి.
గోదావరి పరివాహక ప్రాంతాలైన మద్దులపల్లి, పాల్గుల, కుంట్లం గ్రామాల ప్రజలను శుక్రవారం జడ్పీ సీఈఓ శోభారాణి అప్రమత్తం చేసేందుకు వెళ్లి గ్రామ ప్రజలకు తగు సూచనలు చేశారు. తిరిగి కాళేశ్వరం వైపు వస్తున్న క్రమంలో కాళేశ్వరం పరిధిలోని మద్దులపల్లి సమీపాన ఉప్పొంగి ప్రవహిస్తున్న బండల వాగు దాటే సమయంలో ఎమ్మార్వో కారు వాగు మధ్యలోకి రాగానే నీటి ప్రవాహం ఎక్కువై వరద నీటిలో ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ట్రాక్టర్ సహాయంతో కారును లాగడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. జడ్పీ సీఈఓ వెంట కాళేశ్వరం ఎంపీటీసీ మమత ఉన్నారు.