- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూడు చెదిరే.. ఆదివాసీల ఇళ్లను కూలగొట్టిన అటవీశాఖ
దిశ, పలిమేల : జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని కిష్టం పాడు గ్రామ శివారులో ఆదివాసుల ఇండ్లను అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కూలగొట్టారు. గత నెల రోజుల క్రితము సర్వాయిపేట నీలంపల్లి బూర్గంపాడు గూడెం గ్రామాలకు చెందిన కొంత మంది ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరుచుకున్నారు. అటవీశాఖకు చెందిన భూమిని కొన్ని కుటుంబాలు గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. కాగా, వీరు ప్రభుత్వం ప్రకటించిన పథకంలో తమ భూములు వస్తాయనే ఆశతో అటవీశాఖ భూమిలో నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో అటవీ శాఖ వారు తమ భూమిలో గుడిసెలు వేసుకున్నారనే ఉద్దేశ్యంతో శుక్రవారం ట్రాక్టర్లతో ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. సుమారు 70 కుటుంబాల వారు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. అటవీశాఖ వారు ఆదివాసీల ఇండ్లను కూలగొట్టడంతో వారికి నిలువ నీడ లేకుండా పోయింది.
కొత్తగా నిర్మించినందుకే కూల్చేశాం..
ప్రభుత్వ నిబంధనల మేరకు తాము పనిచేస్తామని, ప్రభుత్వము శాఖ భూముల్లో ఎవరు నిర్మాణాలు చేపట్టవద్దని అడవిలోని చెట్లను కొట్టవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారు ప్రభుత్వ ఆదేశాలు పక్కనపెట్టి గుడిసెలు వేసుకున్నందుకే, తాము కూల్చి వేశామని చేశామని రేంజర్ సంతోష్ దిశకు తెలిపారు.