- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎగిరిన నిఘానేత్రం… బయటికొస్తే అంతే..!
దిశ, నల్లగొండ : లాక్‌డౌన్ కఠిన అమలు కోసం జిల్లా పోలీస్ శాఖ డ్రోన్ కెమెరాలను వినియోగిస్తుందని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో డ్రోన్ కెమెరాల ద్వారా లాక్ డౌన్ అమలు తీరును శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రంగనాధ్ ఆదేశాల మేరకు నల్లగొండతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగించడం ద్వారా లాక్ డౌన్ మరింత కఠినంగా ఆమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసే క్రమంలో గల్లీలలో అనవసరంగా బయట తిరిగే వారిని, కారణం లేకుండా బయటికి వచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, బైకులు, వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పారు. కరోనా కట్టడి కోసం పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు చేపడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కృషి చేస్తున్నదని చెప్పారు. ఆయన వెంట ఐటి. విభాగం సీఐ రౌతు గోపి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది రియాజ్, సుధాకర్ తదితరులున్నారు.