ప్రమాద హెచ్చరిక : గోదావరికి వరద ఉదృతి

by Sridhar Babu |   ( Updated:2021-07-24 01:26:16.0  )
ప్రమాద హెచ్చరిక : గోదావరికి వరద ఉదృతి
X

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి పరుగులు పెడుతుండగా, చర్ల మండలంలో తాలిపేరు పరవళ్ళు తొక్కుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటి రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరువగా ఉంది. శనివారం ఉదయం 11 గంటలకు 45.29 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరిలో 9,81,261 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.

చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు వరద నీటితో పరవళ్ళు తొక్కుతోంది. ప్రాజెక్టు జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తుండటంతో 17 గేట్లు ఎత్తి 17,502 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పలుచోట్ల వంతెనలు ముంచి రహదారులపైకి వరదనీరు చేరడంతో చర్ల నుంచి ములుగు జిల్లా వెంకటాపురం వైపు రాకపోకలు నిలిచిపోయినవి. రోడ్లపైకి వరద వచ్చినచోట బారికేట్లు ఏర్పాటుచేసి పోలీసులు కాపలా కాస్తున్నారు.

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం నెంబర్లు 08744-241950, 08743-232444 లకు సంప్రదించాలని, సహాయం కోసం 93929 19743 నెంబర్‌కు ఫోటోలు వాట్సప్ చేయాలని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed