- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'నిమ్స్'లో కరోనా వ్యాక్సిన్ తొలిదశ తొలి డోసు సక్సెస్
దిశ, న్యూస్‌బ్యూరో: భారత్ బయోటెక్ నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ తొలి దశ తొలి డోస్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, త్వరలో రెండో డోస్ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తొలి డోస్‌ను యాభై మంది వాలంటీర్ల మీద ప్రయోగించామని, వీరంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి సైడ్ ఎఫెక్టులుగానీ, రియాక్షన్ గానీ రాలేదని ఆయన ‘దిశ’కు వివరించారు. మొత్తం అరవై మందిపై తొలి డోస్ ప్రయోగాలు జరగాల్సి ఉందని, కానీ యాభై మందిపైనే ప్రయోగించామని, కొన్ని కారణాలతో పది మంది వాలంటీర్లపై జరగలేదని తెలిపారు. నాలుగైదు రోజుల్లో ఆ పదిమందిపైనా ప్రయోగిస్తామని తెలిపారు. వీరి ఆరోగ్య స్థితిగతులు కూడా తెలుసుకున్న తర్వాత రెండో డోస్ ప్రయోగానికి సిద్ధం కానున్నట్లు తెలిపారు. ‘నిమ్స్’లోని ఫార్మకాలజీ, ఆనెస్థీషియా, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల నిపుణులైన డాక్టర్ల సమక్షంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
తొలుత అనుకున్నట్లుగా షెడ్యూలు ప్రకారం ట్రయల్స్ జరగడంలేదని, కానీ దేశంలో జరుగుతున్న ప్రయోగాలతో పోలిస్తే ‘నిమ్స్’లోనే తొందరగా జరుగుతున్నాయని, దేశం మొత్తం మీద 12 నగరాల్లో ఇవి జరుగుతున్నాయని, హైదరాబాద్ ముందు వరుసలో ఉందని తెలిపారు. రెండో డోస్ ప్రక్రియ ప్రారంభంపై నిర్దిష్ట తేదీని చెప్పలేంగానీ ఈ నెలాఖరుకల్లా మొదలవుతుందని తెలిపారు.