- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో తెలంగాణలో తొలి మరణం
కరోనా వైరస్‌తో తెలంగాణలో తొలి మరణం నమోదు అయింది. ఖైరతాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో సీరియస్ కండిషన్‌లో చేరిన 74 ఏళ్ల వృద్దుడు మృతి చెందాడని.. కాగా, మృతుడికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే, ఈ విషయంపై ఎవరూ కూడా తప్పుడు ప్రచారం చేయకూడదని ఆయన సూచించారు. రాను రాను రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మొత్తం 65 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఈ రోజు ఒక్క రోజే 6 కేసులు నమోదయ్యాయని తెలియజేశారు.
కుత్బుల్లాపూర్ ఏరియాకు చెందిన ఒకే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయని మంత్రి తెలిపారు. అలాగే, హైదరాబాద్‌లో ఎక్కడా కూడా రెడ్ జోన్ విధించలేదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరణ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చిన వారి సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు. క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావోద్దని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.