- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అప్పుడు కూతురుపై అత్యాచారం.. జైలు నుంచి వచ్చి ఇప్పుడు తండ్రిపై..
లక్నో: యూపీ హథ్రాస్‌లో మరో కలకలం రేగింది. లైంగిక వేధింపుల కేసులో బెయిల్‌పై ఉన్న నిందితుడు మరో ముగ్గురిని వెంటవేసుకుని వచ్చి బాధితురాలి తండ్రిని హతమార్చాడు. సస్ని పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పొలంలో పనిచేస్తున్న తండ్రికి తల్లితో కలిసి భోజనాన్ని తీసుకెళ్లిన సమయంలో హత్య జరిగిందని బాధితురాలు ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో మంగళవారం ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు.
కొన్నేళ్ల క్రితం ప్రధాన నిందితుడు గౌరవ్ శర్మ, బాధితురాలితో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. కొన్ని కారణాలతో వివాహం రద్దయింది. కానీ, తర్వాత కూడా గౌరవ్ శర్మ ఆమె వెంటబడ్డాడు. బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. గౌరవ్ శర్మ ఆగడాలను అడ్డుకోవడానికి 2018లో బాధితురాలి తండ్రి ఆయనపై ఫిర్యాదు చేయగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లి గతేడాది బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా, గౌరవ్ శర్మ మరో ముగ్గురు వ్యక్తులు లలిత్ శర్మ, రోహితాశ్ శర్మ, నిఖిల్ శర్మలు కలిసి సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో కారులో వెళ్లి బాధితురాలి తండ్రిని హతమార్చినట్టు ఆమె కూతురు తెలిపారు. తనపై నమోదుచేసిన కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తూ తుపాకీతో కాల్చి చంపారని వివరించారు. ఈ కేసులో లలిత్ శర్మను అరెస్టు చేశామని హథ్రాస్ ఎస్పీ వినీత్ జైస్వాల్ తెలిపారు.