- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫ్యామిలీ..
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీఎంవో నుంచి తమకు ఫోన్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎంవో కార్యాలయం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తమకు తెలిపారని గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తు నవంబర్ 30న సాయంత్రం 4.07 గంటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి స్వర్గస్తులైనట్లు తెలిపారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతోపాటు.. అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు పేర్ని నాని ప్రభుత్వం తరపున హాజరయ్యారని తెలిపారు. ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫ్యామిలీకి చెందిన సాయి మోగేశ్వర్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.