- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైద్యుడా… నీకిది తగునా..?
దిశ, ఆదిలాబాద్: వైద్యో నారాయణ హరీ అన్నారు. కరోనా ప్రళయతాండవం వేళ…ఓ వైద్యుడు మాత్రం ఎవరు చస్తే నాకేంటి అనుకున్నాడో ఏమో కానీ వృత్తి ధర్మాన్ని విస్మరించాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నివారణకు ఎలుగెత్తి ఘోషిస్తుంటే… ఈ వైద్యుడు మాత్రం మర్కజ్ వెళ్లొచ్చి అనేక మంది రోగులకు పరీక్షలు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారంతా బాధ్యతగా వివరాలు వెల్లడించాలని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ వైద్యుడు మర్కజ్ వెళ్లి వచ్చిన విషయం దాచాడని…ఈ సంగతి తెలిసిన ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆదిలాబాదు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రధాన ఆసుపత్రి లో పనిచేసే ఒక సీనియర్ డాక్టర్ ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశాలకు హాజరయ్యాడని తెలుస్తోంది. మార్చ్ 13న ఆదిలాబాద్‌కు వచ్చి యధాతథంగా విధులు నిర్వహించినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తర్వాత రోగులకు పరీక్షలు చేయడంతో పాటు కొన్ని ఆపరేషన్లు కూడా చేశాడన్న విమర్శలు వస్తున్నాయి. అయితే కరీంనగర్ సంఘటన తర్వాత మర్కజ్ వెళ్లి వచ్చిన వారి సమాచారం తవ్వే క్రమంలో ఈ డాక్టర్ ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆయన అనేక మంది రోగులకు వైద్యం చేయడమే తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
కాగా పోలీసుల జోక్యంతో వైద్య ఆరోగ్య శాఖ సదరు వైద్యుని శాంపిల్ సేకరించారని సమాచారం. అయితే తాజాగా ఆదివారం వచ్చిన ఫలితాల్లో ఆ వైద్యుని శాంపిల్ నెగెటివ్ తేలడం గమనార్హం. ఈ పరిణామం హర్షనీయమే అయినా వైద్యుడు ప్రవర్తన మీదనే సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆయన్ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags: Doctor, Rims Hospital, Adilabad, Corona Virus, Delhi, Markaz, Samples, Police, Karimnagar