తిరిగి తిరిగి బేజారోస్తోంది.. జర నా గోస వినండి సారు!

by Shyam |
disabled man
X

దిశ, షాబాద్: ‘‘తిరిగి.. తిరిగి పాణం బేజారోస్తోంది. జర నా గోస విని, నన్ను ఆదుకోండి సారు’’ అని ఓ వికలాంగుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్‌కుంట గ్రామానికి చెందిన జోగు యాదయ్యకు ఏడాది క్రితం బైకు సైలెన్సర్ కాలి కాలుకు తీవ్ర గాయమైంది. రెండేండ్ల క్రితం షుగర్ కారణంగా వైద్యులు కాలు తీసేశారు. నాటినుంచి నేటి వరకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి తిరగని ఆఫీసు లేదు. సర్టిఫికేట్లు చేతపట్టుకొని కలెక్టర్ ఆఫీసుకు, విగలాంగుల ఆఫీసుకు రోజు తిరిగి.. తిరిగి బేజారోస్తుందని శుక్రవారం మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పటికే ట్రీట్మెంట్ కోసం ఉన్న అర ఎకరం భూమి కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయాడు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సైతం దరఖాస్తు చేసుకున్నానని, కానీ, అది కూడా ఇప్పటివరకు అందలేదని వాపోయాడు. తనని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ విషయంపై ఎంతమందికి మొర పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Next Story