బియ్యం వివరాలు అందించండి.. విద్యాశాఖకు లేఖ

by Shyam |
Department of Civil Supplies
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మేరకు బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలను అందించాలని సివిల్ సప్లయి శాఖ విద్యాశాఖను కోరింది. ప్రైవేటు పాఠశాల సిబ్బందికి ఒక్కోక్కరికి 25కిలోల బియ్యం అందించేందుకు సివిల్ సప్లయి శాఖ ప్రభుత్వ పాఠశాలల నుంచి బియ్యం వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బియ్యాన్ని మినహాయించి మిగిలిన బియ్యం వివరాలు అందించాలని విద్యాశాఖను కోరారు. అన్ని జిల్లాల, మండలాల వారిగా వివరాలను ఏప్రిల్ 12 వరకు సమర్పించాలని సూచించారు. వీటితో పాటు జిల్లాల వారిగా ప్రైవేటు విద్యాసంస్థల్లోని సిబ్బంది వివరాలను కూడా ఏప్రిల్ 19వరకు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి సేకరించిన బియ్యాన్ని స్థానికంగా ఉండే రేషన్ దుకాణ ద్వారా ఒక్కో టీచర్‌కు 25కిలోల బియ్యాన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు అందిస్తామని సివిల్ సప్లయి శాఖ తెలిపింది. టీచర్లకు ఐరీస్ ద్వారా ఓటీపీ ద్వారా బియ్యం అందిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed