‘రేప్ డ్రగ్స్’తో సహచరిపై 8 గంటలు అత్యాచారం

by Anukaran |   ( Updated:2021-11-06 06:10:29.0  )
The date rape drugs
X

దిశ, వెబ్‌డెస్క్ : డ్రగ్స్.. ఇప్పుడు దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే కబళిస్తోన్న అంశం. ప్రభుత్వాలు ఎంత నిఘా పెంచినా అడ్డదారుల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. సినీ తారలు, సెలబ్రిటీలు మొదలుకుని కాలేజ్ విద్యార్థుల వరకు మత్తులో జోగుతున్నారు. ఇక డేటింగ్‌లో ఉన్న వాళ్లు సైతం విరివిగా వాడుతున్నారు. లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు కొంతమంది వాడుతుండగా.. మరికొందరు అమ్మాయిలను మత్తులోకి దించి అత్యాచారం చేసేందుకు వాడుతున్నట్లు పోలీసుల నివేదికలో తేలింది.

ప్రస్తుతం ఈ డ్రగ్స్ నిత్యవసర వస్తువుల జాబితాలో చేరినట్లే ఉంది. రేప్ డ్రగ్స్ కోసం ఆన్ లైన్‌లో ఆర్డర్ చేస్తే కేవలం 24 గంటల్లోనే ఇంటికి చేరిపోతోంది. ఈ డ్రగ్స్ తీసుకున్నవారు 6 నుంచి 8 గంటల వరకు మత్తులోనే ఉండిపోతారు. ఇక డేటింగ్ లో ఉన్నవారు సహచరికి ఏదోవిధంగా ఈ డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. బ్రిటన్‌లో సంచలనంగా మారిన ఈ డ్రగ్స్.. నిషేధిత మందుల జాబితాలో ఉన్నది. అయినా ఆన్ లైన్‌లో వీటి అమ్మకాలే జోరుగా సాగుతున్నాయి. ఆర్డరిస్తే చాలు 24 గంటల్లో ఇంటికి చేరిపోతున్నాయి. అంతేగాకుండా… వంద శాతం డెలివరీ అవుతున్న మందుల్లో ఇవి కూడా నిలిచాయని ఓ ఆంగ్ల మీడియా కథనం.

ఇంతకీ ఈ డ్రగ్స్ ఏమిటి?

రోహిప్ నాల్1ఎంజీ లేదా జీహెచ్ బీ పౌడర్‌ను మందులను డేట్ రేప్ డ్రగ్స్ అంటారు. సాధారణంగా వీటిని స్లీపింగ్ పిల్స్‌గా పేర్కొంటారు. రోహిప్ నాల్ వాడినవారు ఒక్కసారిగా తీవ్రమైన మగత నిద్రలోకి జారుకుంటారు. వారి పక్కన బాంబు పేల్చినా లేవలేరు. 6 నుంచి 8 గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది. అయితే బ్రిటన్‌లో ఈ మందులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. రోగి ప్రత్యేక పరిస్థితుల్లో.. నిపుణులైన వైద్యుల సిఫారసు మేరకు మాత్రమే వీటిని అమ్మాల్సి ఉంటుంది. అలాగే, కొన్ని స్పెషల్ స్టోర్లలో మాత్రమే ఇవి దొరుకుతాయి. అయితే.. ఈ మందును వైద్యులు ఎక్కువగా సిఫారసు చేయకపోయినా సదరు కంపెనీ సేల్స్ అధికంగా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు.

అలాగే.. సెప్టెంబరు, అక్టోబరు రెండు నెలల్లోనే పోలీసులకు మత్తుతో జోగుతున్న వారి నుంచి 198 కాల్స్ వచ్చాయి. తీగలాగితే డొంకకదిలింది. కొందరు డీలర్లు క్రిమినల్స్‌తో చేతులు కలిపినట్లు తేలింది. ఆ గ్యాంగ్ ఆన్ లైన్‌లో ఎవరు ఆర్డరిస్తే వారికి ఈ మందులు సరఫరా చేస్తున్నారు. 184 పౌండ్లకు రోహిప్ నాల్ 100 టాబ్లెట్లు ఇంటికే తెచ్చిస్తున్నారు. ఇండియా కరెన్సీలో సుమారు రూ.20 వేలు. ఇక జీహెచ్ బీ పౌడర్‌ను ఒక గ్రాముకు సుమారు 30 పౌండ్లు.. ఇండియన్ కరెన్సీలో సుమారు 3 వేలకే అందిస్తున్నారు.

ముఖ్యంగా… డేటింగ్‌లో ఉన్నవారు వీటిని కొంటున్నట్లుగా గుర్తించారు. అలాగే.. కొందరు క్రిమినల్స్ కూడా వీటిని కొంటున్నారు. ఆ టాబ్లెట్లను ఏదో రకంగా అమ్మాయిలకు లేదా మహిళలకు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ మందుల అమ్మకాలకు బ్రిటన్ ఒక డిస్టినేషన్‌గా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు ఆదేశించింది.

READ: సెల్‌ఫోన్‌లో భార్య చిలిపి పని.. అది చూసిన భర్త షాకింగ్ డెసిషన్
Advertisement

Next Story

Most Viewed