- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టుల కోసం వందల మంది వస్తున్నా…
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా రాపర్తినగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో తక్షణం రోజుకు 500కు తగ్గకుండా కరోనా టెస్టులు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. మంగళవారం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు వై.విక్రమ్ మాట్లాడుతూ… రాపర్తినగర్ ఆరోగ్య కేంద్రం పరిధిలో లక్షమంది ప్రజలు వుంటే కేవలం రోజు 20 టెస్టులు మాత్రమే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెస్టులు చేయాలని వందల సంఖ్యలో జనం వస్తున్నా.. పట్టించుకోవడం లేదని అన్నారు. ఖమ్మం నగరంలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నదని దీనిని అరికట్టే చర్యలు తగిన రీతిలో లేవని ఆరోపించారు. ఖమ్మం నియోజకవర్గంలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లలో తక్షణం కరోనా టెస్టుల కిట్లు సంఖ్య గణనీయంగా పెంచాలన్నారు. ఆర్టీ పీసీఆర్ టెస్టులు కూడా ఈ కేంద్రాల్లోనే చేయాలని డిమాండ్ చేశారు.